KMR: సమీపంలోని గద్దగూండా తండా వద్ద జాతీయ రహదారి–161పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఢీకొనడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
హైవేపై ప్రమాదం.. రెండు బైకులు ఢీ


