KMR: సదాశివనగర్ హైవేలపై లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇన్నోవా వాహనం, 20 డీజిల్ క్యాన్లు, పైపు, 3 నంబర్ ప్లేట్లు, 3 సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో పలు ప్రాంతాల్లో డీజిల్ చోరీలకు పాల్పడినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణ
డీజిల్ దొంగతనాల ముఠా అరెస్ట్


