హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'

ATP: అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో ఎండిన వేరుశెనగ పంట పొలాలను సీపీఎం జిల్లా కమిటీ బృందం పరిశీలించింది. వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని నాయకులు కోరారు. దెబ్బతిన్న రైతాంగాన్ని, పశువులు, గొర్రెల కాపరులను, పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.