హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో దశ కాలువలు వెలవెల

SRPT: శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల్లో చుక్క నీరు లేక సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ పరిధిలోని 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు తీవ్ర సంక్షోభంలో పడింది. ఎల్‌ఎండీ, బయన్నవాగులలో నీటిమట్టం అడుగంటడంతో అధికారులు సాగునీరు నిలిపివేశారు. వర్షాలు లేక, భూగర్భ జలాలు ఇంకిపోయి నాట్లు వేసిన వరి పైర్లు కళ్లముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.