హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయంటే?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని శాసనాలు వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 966లో పల్లవ రాణి సామవై పెరుందేవి దానశాసనం తొలి ఆధారంగా నిలవగా, అనంతరం చోళులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో ఉత్సవాలు విస్తరించాయి. 1513లో శ్రీకృష్ణదేవరాయలు కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేశారు.