హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాణాసంచా అక్రమ నిల్వలపై పోలీసుల దాడులు

కోనసీమ: అంబాజీపేట మండలం కె.పెదపూడిలో ఆదివారం రాత్రి బాణాసంచా అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నెల 9న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ ప్రాంతంలో ఉన్న నివాసాలలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించి, పి.గన్నవరం సీఐ భీమరాజు, ఎస్సై షేక్ సుభాని తనిఖీలు చేసి బాణాసంచా నిల్వలను సీజ్ చేశారు.