హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

NRML: వానాకాలం సాగు పనులు జోరందుకున్న వేళ నిర్మల్‌ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో ‘నో స్టాక్‌’ చూపించడంతో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక రైతులు పదేపదే పరిశీలించాల్సి వస్తోంది. సర్వర్‌, నెట్‌వర్క్‌ సమస్యలతో బుకింగ్‌లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.