హైదరాబాద్: 28°C
క్రైమ్

వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యూపీలో గోడలు కూలిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. బీహార్‌లో గంగానది ఉద్ధృతికి 12 జిల్లాల్లో 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. పూర్ణియాలో వంతెన కొట్టుకుపోగా, పట్నాలో లోతట్టు ప్రాంతాలు జలమయమై రైళ్లు రద్దయ్యాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడుతుండటంతో నదుల ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.