హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్‌లో దొంగల హల్‌చల్..!

SRD: జహీరాబాద్ మండల కేంద్రంలోని నారాయణనగర్ కాలనీలో నిన్న రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసిన కెంపుల సాయన్న ఇంటి తలుపులు పగలగొట్టి, లోపల ఉన్న 5 తులాల 2 మాసాల బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో SI లవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపహరణకు గురైన సొత్తు విలువ రూ.1,94,400 అని వెల్లడించారు.