హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మకు ఘనంగా ధ్వజారోహణం

గద్వాల పట్టణంలోని జమ్మిచేడులో కొలువైన శ్రీ జమదగ్ని సమేత జమ్ములమ్మ కల్యాణోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ధ్వజారోహణం, ఎదుర్కోళ్లు ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కృష్ణా నదీ పవిత్ర జలాలతో అభిషేకం, ఆకుపూజ, హోమం తదితర వైదిక పూజలు జరిగాయి. ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.