హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానసిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య

SRCL: వేములవాడ చీర్లవంచ గ్రామంలో ఆదివారం వివాహిత బోయిని అరుణ (34) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం శంకర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న అరుణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లడంతో పిల్లలతో కలిసి అత్తవారింట్లో ఉంటున్నారు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.