హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజుల ఐక్యతతోనే అభివృద్ధి: దయాకర్ రెడ్డి

KMM: ముదిరాజులందరూ ఐక్యమత్యంతో ముందడుగు వేయాలని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన, అనంతరం సమాజ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.