హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి'

SRCL: శాసనసభ సమావేశాల్లో జిల్లా అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. నేత కార్మికులు, రైతుల సమస్యలతో పాటు విద్య, రహదారులు తదితర రంగాల్లో వసతుల కల్పనకు కృషి చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.