హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమరాడలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు సంచరిస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం అంకుల్లవలస పరిసర పొలాల్లో ఏనుగులు తిరిగినట్లు రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బతినడంతో పాటు పొలం పనులు చేసుకోలేకపోతున్నామని వాపోయారు. దీంతో వ్యవసాయంలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.