హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు

SDPT: శ్రావణ ఆఖరి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తజనసందోహంగా మారింది. క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలాచరించి మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక దర్శన క్యూలైన్లు, విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.