హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూపల్లి సమక్షంలో వినతుల వెల్లువ

NRML: బాసరకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాసరతోపాటు ఇతర గ్రామాల నుంచి వచ్చి నాయకులు వినతులు అందజేశారు. ముఖ్యంగా గోదావరి నదిలో కొంతకాలంగా బోటింగ్ నిలిపివేయడంతో 30 కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. త్వరలో గోదావరి నదిలో బోటింగ్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మంత్రిని సన్మానించి ఆయనతో ఫొటోలు దిగారు.