అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురంలో పెద్దపులి కలకలం రేపింది. శివాలయం సమీపంలో ఆదివారం సాయంత్రం పులి సంచరించడంతో గ్రామస్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆలయం వద్ద పులి పాదముద్రలను గుర్తించారు. పశువుల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీఐ గజేంద్రకుమార్ గ్రామస్థులను అప్రమత్తం చేసి, రాత్రివేళ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం


