హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బస్ షెల్టర్ వద్ద తుప్పలు తొలగించండి'

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి బస్ షెల్టర్ వద్ద తుప్పలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. షెల్టర్ చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వెళ్లడానికి మార్గం కూడా లేకుండా దారుణంగా ఉందన్నారు. గ్రామంలో ఆశ్రమ పాఠశాల ఉండడంతో నిత్యం విద్యార్థుల తల్లిదండ్రులు రాకపోకలు సాగిస్తారని, అయితే వారు వేచి ఉండడానికి కనీసం నీడ లేకుండా పోయిందన్నారు.