BDK: భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ అంకిత్ ప్రకటించారు. అన్ని శాఖల మండల అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్


