హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముద్ర రుణం పేరిట యువకుడికి టోకరా

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో రూ.7 లక్షల ముద్ర రుణం మంజూరైందంటూ నమ్మించి ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.07 లక్షలకు వల వేశారు. రుణం కోసం పలు విడతల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా నగదు పంపించాడు. మరో రూ.50 వేలు పంపితే రూ.10 లక్షలు వస్తాయని చెప్పడంతో అనుమానం వచ్చిన యువకుడు 1930కు ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.