SRPT: అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో ఆదివారం రాత్రి బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా తరలివచ్చి గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ
ఘనంగా బోనాల పండుగ


