హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేయాలి'

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపుతో BRS ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం హామీని అమలు చేసి బకాయిలు చెల్లించాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తార్ మియా అన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుందన్నారు.