హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీకా అనంతరం శిశువు మృతి

MLG: ములుగు మండలం పొట్లాపూర్‌లో 50 రోజుల ఆడ శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం 45 రోజుల టీకా వేయించుకున్న అనంతరం రాత్రి శిశువుకు అస్వస్థత రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టీకా కారణంగానే మృతి జరిగిందని శిశువు తాత ధన్‌సింగ్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు.