హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోటలో వినాయక విగ్రహాల సందడి

KKD: గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సామర్లకోట పట్టణంలో వివిధ ఆకృతుల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరాయి. విశాఖ జిల్లా నుంచి వ్యాపారులు భారీగా విగ్రహాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ధరలు రూ.500 నుంచి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.