HYD: జూబ్లీహిల్స్ పరిధిలో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. శ్రీకృష్ణానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి బాశకర్ల విజయ్ కుమార్ ఫోన్‌లోకి మాల్వేర్ APK ఫైళ్లను పంపి, ఆయన బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.8.30 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడికి తెలియకుండానే లోన్ కూడా డ్రా చేశారు. విజయ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
సైబర్ మోసం.. రూ.8.30 లక్షలు మాయం


