హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచే కొత్త పింఛన్ల దరఖాస్తులు

KRNL: ఎన్టీఆర్‌ భరోసా కింద కొత్త పింఛన్లకు నేటి నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ డా. ఏ.సిరి తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో  రేషన్, ఆదాయ, ఆధార్‌ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి 21 వాటిని పరిశీలించి, 22 నుంచి 24 వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు.