హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ప్రమాదంలో వ్యక్తి మృతి

HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్ జాతీయ రహదారిపై ఇటుక రాజు ఈశ్వర్ (60) నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు.