హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

WG: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం జీఆర్పీ SI అప్పారావు ఆదివారం రాత్రి తెలిపారు. ఈ ఘటన కొవ్వూరు చాగల్లు మధ్య రైల్వే ట్రాక్ పై జరిగినట్లు చెప్పారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, 5.4 అడుగుల ఎత్తు ఉన్నట్లు తెలిపారు. బ్రౌన్ కలర్ కార్గో జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు.