హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారి పక్కన పైప్‌లైన్ లీకేజ్..!

GDWL: అలంపూర్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో మున్సిపాలిటీ ఆఫీస్ సమీపంలో రహదారి పక్కన నేడు నీటి పైప్‌లైన్ లీకేజ్ అయ్యింది. గత నెలలో ఇక్కడే నీటి లీకేజీ కాగా అధికారులు స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించారు. వారం రోజులు గడిచే లోపు మరోసారి పైప్ లైన్ దెబ్బతింది. దీంతో నీరు వృథాగా పోతుంది. పాలకవర్గం స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.