హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ సమస్యలతో మహిళ బలవన్మరణం

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన నౌగిరి రాధాబాయి (58) కుటుంబ సమస్యలతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త రాజలింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన రాధాబాయి ఇంట్లో పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నౌగిరి రాధాబాయి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.