హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న వర్షానికే రోడ్లు జలమయం

ప్రకాశం: టంగుటూరులో కేవలం ఐదు నిమిషాలు కురిసిన వర్షానికే రోడ్లు మొత్తం జలమయంగా మారాయి.  పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే సమస్య ఎదురవుతుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.