హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతిభద్రతలకు సహకరించాలి : CI

KDP: ప్రజలంతా పరస్పర సోదరభావంతో ప్రశాంతంగా జీవించాలని చెన్నూరు CI చాంద్ బాషా సూచించారు. శివాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి బస చేసిన ఆయన గ్రామసభలో మాట్లాడారు. ఎన్నికలు, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సూచించారు.