హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాగు పంటల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి'

ASF: పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు సాగు చేస్తున్న పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని AEO వినోద్ సూచించారు. ఇవాళ ఉ. 10 గంటలకు రెబ్బెన మండలం గోలేటిలో పంట నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంట నమోదు చేసుకుంటే పత్తి, కందులు, వరి పంటలను సులువుగా విక్రయించుకోవచ్చన్నారు. లేకుంటే పంటల విక్రయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.