హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ సీట్ సాధించిన ఆయేషా

JGL: ఎండపల్లి మండలం కొండాపూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అంకుస్–అజీజ్ దంపతుల కుమార్తె మహమ్మద్ ఆయేషా నీట్ (NEET-UG)లో అర్హత సాధించి జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. గ్రామీణ, నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి చదివి వైద్య విద్యలో ప్రవేశం పొందడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు అయోషాను అభినందించారు.