SDPT: హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కోతులు తీవ్ర కలకలం సృష్టించాయి. హర్షిత్ (9) అనే బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కోతుల దాడులు నిత్యకృత్యమవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
బాలుడిపై కోతుల దాడి


