SRD: ఇటీవలి వర్షాలకు ఆందోల్ మండలంలోని అన్నాసాగర్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. ఎల్‌నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సూచించినా, ప్రస్తుతం నీటిమట్టం పుష్కలంగా పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వరి పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందని ధీమాగా ఉన్నారు.
తెలంగాణ
అన్నాసాగర్‌లో జలకళ


