హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

ASR: సోమవారం నుంచి సచివాలయాల ద్వారా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ, ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కానుందని ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, మత్స్యకారులు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, రైస్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు సదరం పత్రం సమర్పించాలన్నారు.