హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

PLD: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. చికటిగలపాలెం రోడ్డులో ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల కోసం పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది గాలిస్తున్నారు.  ఆచూకీ తెలిసిన వారు తమను ఆశ్రయించాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.