KNR: జమ్మికుంట 5వ వార్డు పిట్టలవాడలో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరైన బిట్ల స్వప్న, బుర్రి లక్ష్మి గృహాల వద్ద కౌన్సిలర్ యాట్ల సునీత భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం, రేషన్ కార్డులు, సన్నబియ్యం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం


