హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డీజే నిర్వాహకులకు ఎస్సై సూచనలు

కృష్ణా: వినాయక చవితి సందర్భంగా కృత్తివెన్ను ఎస్సై పైడి బాబు డీజే బాక్స్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. డీజే వినియోగానికి పోలీస్‌ స్టేషన్‌లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టేలా పాటలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్‌ఐ సూచించారు.