హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని శ్రీకరం కళ్యాణ మండపంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల కృషి ఫలితమే గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ విజయమని అన్నారు. వార్డుల సంఖ్య 32కు పెరగడంతో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు.