MHBD: బయ్యారం మండలం నర్సాతండా గ్రామపంచాయతీ పరిధి నాగారం తండాలో ఆరుబయట నిద్రిస్తున్న గిరిజన మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును దొంగలు అపహరించారు. ఆదివారం రాత్రి ఇంటి ముందు రేకుల కింద నిద్రిస్తున్న ఉప్పమ్మ మెడలోని పుస్తెలతాడును సుమారు రాత్రి 2 గంటలకు కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ


