హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌

BDK: భద్రాచలం మండల కేంద్రంలో ఆదివారం గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ అంకిత్‌, సర్పంచ్‌ పూనెం కృష్ణ, ఆలయ ఈవో దామోదర్‌ పాల్గొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించడమే లక్ష్యమని తెలిపారు.