హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా స్వామివారి తిరువీధి ఉత్సవం

BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఘనంగా నిర్వహించారు. మాడవీధుల్లో శ్రీ స్వామివారిని శోభాయమానంగా ఊరేగించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మృదంగ మంగళధ్వనులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు.