హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బోనాల పండుగ

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. యువత ఉత్సాహంగా నృత్యాలు చేయడంతో కాలనీ సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాలతో మోత్కూర్ హోరెత్తింది.