హైదరాబాద్: 28°C
తెలంగాణ

70 ఏళ్ల తర్వాత మళ్లీ చందనోత్సవం: ఈవో

JGL: చరిత్ర ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60- 70 ఏళ్ల విరామం తర్వాత చందనోత్సవం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ అనుమతులు లభించాయని ఈవో అంజనారెడ్డి తెలిపారు. నవంబర్ 15 నుంచి 20 వరకు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించి, 20న ఉదయం 9:50 గంటలకు స్వామివారికి చందనోత్సవం చేపట్టనున్నట్లు వెల్లడించారు.