హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాతావరణ మార్పులపై సమష్టిగా పోరాడాలి: ఎంపీ

WGL: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు దక్షిణాసియా దేశాలు సమష్టిగా పనిచేయాలని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. ఆదివారం భూటాన్‌ రాజధాని థింపూలో నిర్వహించిన సౌత్‌ ఏషియా పార్లమెంటరీ డైలాగ్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. అధిక ఉష్ణోగ్రతలు, వరదలు, కరువులు, నీటి కొరతతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలి.