హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా VHP స్థాపన దినోత్సవం

SRCL: వేములవాడ గాయత్రి మాత ఆలయంలో విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు పల్లె శ్యామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ, గోరక్షణ, మతమార్పిడుల నివారణకు విహెచ్‌పీ కృషి చేస్తోందన్నారు. హిందూ సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యంతో పాటు సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.