KNR: చొప్పదండి సాయిబాబా ఆలయ ట్రస్టు ఛైర్మన్‌గా గుర్రం హనుమంతరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు కటకం భూమయ్య, దూస లక్ష్మినర్సయ్య, గుర్రం రాంరెడ్డి ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. తనపై నమ్మకం ఉంచి ఛైర్మన్‌గా ఎన్నుకున్న సభ్యులకు హనుమంతరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దండే లింగన్న, దూస రాము పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ ట్రస్టు ఛైర్మన్‌గా హనుమంతరెడ్డి


