హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మండల కార్యదర్శిగా కాపవరపు రవి

SRCL: ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ కార్యదర్శిగా కాపవరపు రవి, ఉపాధ్యక్షుడిగా నేవూరి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులను పార్టీ శ్రేణులు అభినందించాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపాలన్నారు.